న్యూఢిల్లీ : ‘ఇంటాలరెంట్ ఇండియా–హౌ మోదీ ఈజ్ ఎన్‌డేంజరింగ్ వరల్డ్స్ బిగ్గెస్ట్ డెమోక్రసీ (అసహన భారత దేశం–ప్రపంచంలో అతిపెద్ద ప్రజాస్వామ్యానికి మోదీతో ముచ్చుకొస్తున్న ముప్పు)’ అన్న శీర్షికతో లండన్ నుంచి వెలువడుతున్న ప్రముఖ ఆర్థిక అంశాల విశ్లేషణ పత్రక ‘ది ఎకనమిస్ట్’ జనవరి 23 నాటి సంచికలో కవర్ పేజీ వార్త రాయడం భారత్‌లో అలజడి రేపింది. ప్రధానంగా ఆ పత్రికను తిడుతూ ట్వీట్లు వెలువడుతున్నాయి. (తినే అలవాట్లు బట్టి ఏ దేశమో చెప్పొచ్చు..)
‘మందిర్, సీఏఏ, ఎన్‌ఆర్‌సీ తదితర అంశాలపై కాకుండా దేశ ఆర్థిక పరిస్థితులపై దష్టి సారించాల్సిందిగా వీరంతా ఎందుకు కోరుకుంటున్నారంటే, వచ్చే ఎన్నికల్లో మోదీ ఓడిపోవాలని’ అంటూ పంకజ్ మిశ్రా స్పందించారు.